AP: ఇంటింటికీ సోలార్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో 100 శాతం సౌర విద్యుత్ వినియోగాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం 132 గ్రామాలు కేవలం సౌర విద్యుత్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.