ఒంగోలు: ఆదివారం కూడా విద్యుత్ బిల్లులు కట్టవచ్చు
జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల కేంద్రాలు ఈనెల 24వ తేదీన పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ అధికారి కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఒంగోలులోని వారి కార్యాలయంలో మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యం కొరకు ఆదివారం విద్యుత్ బిల్లులు కట్టించుకునే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బిల్లులు చెల్లించాలని కోరారు.