ఒంగోలు: మృతుల బంధువులను పరామర్శించిన ఎస్పీ

61பார்த்தது
ఒంగోలు: మృతుల బంధువులను పరామర్శించిన ఎస్పీ
ఒంగోలు మండలం పరిధిలోని కొప్పోలు గ్రామం వద్ద స్కూటీపై వెళ్తున్న చిన్నారులకు రహదారి ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమ్స్ వైద్యశాలలోని మార్చురీ వద్ద బాధితులతో మాట్లాడారు. ప్రమాదం పై సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. చిన్నారులకు బైకులు ఇవ్వవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி