మార్కాపురం డివిజన్ పరిధిలోని పాత్రికేయులకు, ప్రజలకు గురువారం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ప్రారంభించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్యులు పలువురు పాత్రికేయులకు ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.