కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై అరా తీశారు. ఆసుపత్రిలోని దెబ్బతిన్న భవనాలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కలెక్టర్, మంత్రికి చూపించారు. నూతన భవనాల నిర్మాణానికి, ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.