ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు స్థానిక ఎస్సై మహేష్ పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పిస్తూ ఎవరైనా మీతో చెడుగా ప్రవర్తిస్తే తల్లితండ్రులకు కానీ మీ ఉపాధ్యాయులకు కానీ వెంటనే తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉంటూ బాగా చదువుకోవాలన్నారు.