ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్లో మంగళవారం సిపిఎం నాయకులు రాఘవులు మీడియా సమావేశం నిర్వహించారు. దోర్నాలలోని వెలుగొండ ప్రాజెక్టు సందర్శించిన ఆయన పనులు నత్తనడకన సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వెలిగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్ త్వరగా పూర్తయ్యేందుకు రూ. 1, 500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో కరువు కాటకాలు దూరమవుతాయి అన్నారు.