టంగుటూరు లోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారి స్వర్ణలత శనివారం తనిఖీ చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఆమె ఎరువుల దుకాణాలను పరిశీలించారు. కొత్త రకమైన ఎరువులను విక్రయిస్తూ ఉండడంతో ఆ ఎరువులను శాంపిల్స్ ను స్వర్ణలత సేకరించారు. ల్యాబ్ కు పంపి పరీక్షలు చేయిస్తామని చెప్పారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణ యజమానులను ఆమె హెచ్చరించారు.