ప్రకాశం జిల్లా, సింగరాయకొండలోని బింగినపల్లి, పెద్దన్నపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు తలెత్తిన నీటి సమస్య పరిష్కరించాలని స్థానిక మంత్రి స్వామికి విజ్ఞప్తి చేశారు. పాలేరు, బిట్రగుంట సప్లై ఛానల్ కాలువకు మరమ్మతులు చేయాలని దానివల్ల 9 గ్రామల రైతులకు నీరందుతుందని రైతులు అన్నారు. గురువారం రైతులు సప్లై ఛానల్ కాలవను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అన్నారు.