బీసీ కాలనీలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరిలోని బీసీ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని ప్రజలు శుక్రవారం ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ కాలనీలో ఇప్పటికే కొన్ని విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించామని, అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని, నీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు.