ప్రకాశం జిల్లా అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట ప్రాంతాలలో గురువారం పోలీసులు ఏకకాలంలో పలు దుకాణాలను తనిఖీ చేశారు. అక్రమంగా నిలువ ఉంచిన రెండు లక్షల రూపాయలు విలువచేసే దీపావళి బాణ సంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా దీపావళి బాణాసంచా నిలువ ఉంచిన ఐదు మంది పై కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా దీపావళి బాణా సంచ నిలువ ఉంచడం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరించారు.