ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ళలో సోమవారం మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 క్వాటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నరసింహారావు పేర్కొన్నారు. మండలంలో మద్యం బెల్టు షాపులు నిర్వహించరాదన్నారు.