కురిచేడు: వివాహిత అనుమానాస్పద మృతి
ఓ వివాహిత తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన కురిచేడు మండలంలోని పేరంబొట్లపాలెం గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన కల్పన తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సై శివ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.