నాటుసారా ముద్దాయిలపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు రాజాం ఎక్సైజ్ సీఐ ఆర్. జైభీమ్ సోమవారం తెలిపారు. ఈ మేరకు వంగర మండలంలోని కేసులు నమోదు చేసిన వారిని వంగర తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. అయితే గతంలో ఇదే ముగ్గురు వ్యక్తులు నాటు సారా విక్రాయించిన కేసుల్లో ఉన్నారని తెలిపారు. ఎవరైనా నాటు సారా తయారీ చేసిన, విక్రాయించిన కఠిన చర్యలు తప్పవని సీఐ జైభీమ్ హెచ్చిరించారు.