నెల్లిమర్ల మండలం పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడిగా కొండగుంపాం కార్యదర్శిగా పనిచేస్తున్న లెంక తౌడు నియామకమయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీదేవి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సీతారామునిపేట పంచాయతీ కార్యదర్శి కే బంగారు రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహ కార్యదర్శిగా సంతోష్ కుమార్, కోశాధికారిగా సురేష్ ను ఎన్నుకున్నారు.