రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా బాధ్యతులు స్వీకరించిన కర్రోతు బంగార్రాజుకి అపూర్వ స్వాగతం లభించింది. విజయవాడలో బాధ్యతలు స్వీకరించి తిరిగి జిల్లాకి వచ్చిన ఆయనకి కార్యకర్తలు, అభిమానులు రాజాపులోవ జంక్షన్ వద్ద ఘనంగా ఆహ్వానం పలికారు. అక్కడ నుంచి ఊరేగింపుగా విజయనగరం, డెంకాడ మీదుగా నాతవలస వద్దకు చేరుకున్నారు. నెల్లిమర్ల టిడిపి నాయకులతో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.