నెల్లిమర్ల పోలీసులు ముమ్మరంగా సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. విజయనగరం-రాజాం ప్రధాన రహదారిలో ప్రయాణిస్తున్న వాహనాలను స్థానిక మిమ్స్ జంక్షన్ లో ఎస్ఐ బి. గణేశ్, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులు, లైసెస్సులు లేని వారికి జరిమానాలు విధించారు. రహదారి భద్రతపై వాహనదారులకు ఎస్ఐ పలు సూచనలు చేశారు.