స్వచ్చ సుందర పార్వతీపురం లక్ష్యంగా కృషి చేయాలని మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి. కొండలరావు అన్నారు. గురువారం జియ్యంవలస మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో స్వచ్ఛ సుందర పార్వతీపురంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాను స్వచ్ఛ సుందర జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు.