పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) అన్నారు. శుక్రవారం బొబ్బిలి నియోజకవర్గంలో పలు గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పింఛను అందించారు. ఇంటింటికి వెళ్తూ బేబీ నాయన లబ్ధిదారులకు ఫించన్ పంపిణీ చేశారు. అలాగే వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.