ఫ్రీ హోల్డ్ రైట్స్ ఫైల్స్ పరిశీలించిన సబ్ కలెక్టర్ సంజనాసింహ
గుంటూరు జిల్లా, పొన్నూరు మండల తహసిల్దార్ కార్యాలయాన్ని గురువారం తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫ్రీ హోల్డ్ రైట్స్ ఫైల్స్ ను పరిశీలించారు. రైతులకు అసైన్డ్ భూములను సాగు చేసుకొనుటకు ప్రభుత్వం ఇచ్చిన భూముల దస్త్రాలను పరిశీలించేందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. డిప్యూటీ తహసిల్దార్ ప్రశాంతి, కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.