పొన్నూరు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ల పై పని ఒత్తిడి తగ్గించండి
పొన్నూరు మండలంలోని గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్, ఎంపీడీవోలకు సిబ్బంది వినతి పత్రాలు అందించారు. ఎన్ఆర్ఈజీఎస్ పల్లె పండుగ, సిసి రోడ్, గృహ నిర్మాణం కాకుండా అదనంగా ఎన్సిపిఐ లింకింగ్ సర్వే, బి ఎల్ ఓ, పి ఆర్ వన్ యాప్ చేస్తూ ఆదివారం కూడా విధులు నిర్వహిస్తున్నామని పని ఒత్తిడి తగ్గించాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.