గురజాల: కాలువలో డెడ్ బాడీ.. కేసు ఛేదించిన పోలీసులు
పల్నాడు జిల్లాలో కాలువలో డెడ్ బాడీ కేసును పోలీసులు ఛేదించారు. డీస్పీ జగదీశ్ కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కుట్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ షరీఫ్ (19) గత పదేళ్లుగా గురజాల మండలం పాతఅంబాపురంలో కూలీ పనులు చేస్తున్నాడు. యజమానులైన ఆనం అంకిరెడ్డి, సైదమ్మ దంపతులు ఇతనికి రూ. లక్ష కూలీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. గట్టిగా అడగడంతో షరీఫ్ ను హత్య చేసి గోతంలో చుట్టి కాలువలో పడేశారు.