సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ఉదయగిరి ఎమ్మెల్యే
ఈనెల 26 నుండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ అవకాశం ఉన్న సద్వినియోగం చేసుకొని సభ్యత్వాన్ని పొందాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరారు. ఆదివారం దుత్తలూరు మండలం నర్రవాడలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై ఉందని అందరూ చురుగ్గా పాల్గొనాలన్నారు.