విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎం) నరేంద్ర పాటిల్ ని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో కలిసి కావలి నియోజకవర్గం కు సంబందించిన పలు రైల్వే సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జి లకు సంబందించిన పలు ప్రతిపాదనలు, పెండింగ్ లో ఉన్న పనులకు సంబందించిన వినతి పత్రాలను ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి డిఆర్ఎంకి అందజేశారు.