ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు తక్షణమే ఇవ్వాలని ఏఐకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు మండల తహశీల్దార్ శేషఫణికి వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు పెట్టుబడి సాయంపై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. తక్షణమే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.