ఆత్మకూరులో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు
రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులు పురుగుమందుల దుకాణ దారులు అధిక ధరలకు విక్రయిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని ఎరువుల పురుగుల మందు దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సూచించిన మార్గదర్శకాలను దుకాణా నిర్వాహకులు తప్పనిసరి పాటించాలన్నారు.