స్వచ్ఛతా హీ సేవా పురస్కారం అందుకున్న ఈవోఆర్డీ శివ నాగజ్యోతి
మహానంది మండలం ఈవోఆర్డి శివ నాగజ్యోతి స్వచ్ఛతా హీ సేవా పురస్కారం అందుకున్నారు. మహానంది మండలంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, న్యాయశాఖ మంత్రి ఫారుక్ చేతుల మీదుగా పురస్కారం బుధవారం అందుకున్నారు. పురస్కారం అందుకున్న ఈవోఆర్డి శివ నాగజ్యోతిని ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, అధికారులు పలువురు అభినందించారు.