పులివెందుల: నిప్పంటిచుకుని మహిళ మృతి
పులివెందుల పట్టణంలోని విజయమ్మ కాలనీలో నివాసముంటున్న యాదవకుంట రాజేశ్వరి గురువారం నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన సదాశివారెడ్డితో మృతురాలికి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. గత పదేళ్లనుంచి రాజేశ్వరి మానసికంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిప్పంటించుకుని మృతి చెందిందని పేర్కొన్నారు.