నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే జయ సూర్య ఆదేశాల మేరకు, గురువారం నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ ఎస్. బేబీ, వైస్-చైర్మన్ మొల్ల రబ్బాని మల్యాల పంప్ హౌస్‌ను సందర్శించారు. వారు మోటర్ల పనితీరు, క్లోరినేషన్, ప్యూరిఫైయింగ్, వర్కర్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అక్కడి సమస్యలు గురించి సమాచారం సేకరించి, వర్కర్లతో సహాయంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.