జమ్ముకాశ్మీర్‌లో మృత్యువాత పడిన బీటెక్ విద్యార్థి వెంకట్ ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని శనివారం పత్తికొండకు తీసుకువచ్చారు. తండ్రి ప్రతాప్‌రెడ్డి, బంధువులు విమానంలో కాశ్మీర్‌కు వెళ్లి మృతదేహాన్ని పత్తికొండకు తరలించారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లి అనిత రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్టణంలోని తేరు బజార్ ఇంటి నుంచి వెళ్లి పత్తికొండ శ్మశాన వాటిలో ఖననం చేశారు.