గోస్పాడు శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో గురువారం వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులతో ప్రతి ఒక్కరితో పుస్తక పఠనం చేయించి, తప్పులను సరిచేసి ఇలా మనం చదివి అందరినీ ఆకర్షించుకోవచ్చు, చదివే విధానం గురించి అవగాహన కల్పించారు. ప్రతిరోజు పుస్తకాలు చదివితే చక్కగా చదవవచ్చు అని తెలియజేశారు. తదుపరి విద్యార్థులకు యోగాసనాలు చేయించారు. వీరికి చల్లని నీరు, బిస్కెట్ ప్యాకెట్లను గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని అందజేశారు. ప్రతి దినం పుస్తకం చదవటం మర్చిపోవద్దని హిత బోధ చేశారు.