గోస్పాడు శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో ఈరోజు అనగా తేదీ: 08- 06-2023 న వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించినచో పర్యావరణం మనలను సంరక్షిస్తుంది. మానవాళికే కాక సర్వ ప్రాణులకు ప్రాణాధార మైన ఆక్సిజన్ ను అందిస్తుంది. ఇది తెలుసుకుని మనమంతా కలిసికట్టుగా పర్యావరణాన్ని రక్షించాలని కోరుతున్నానన్నారు. తదుపరి పరుగు పందెం విద్యార్థులతో ఆడించారు. వీరికి చల్లని నీరు, బిస్కెట్ ప్యాకెట్లను గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని అందజేశారు. ప్రతి దినం పుస్తకం చదవటం మర్చిపోవద్దని హిత బోధ చేశారు.