వేసవి విజ్ఞాన శిబిరంలో మానవాళి మనుగడకు భగవద్గీత అవగాహన

538பார்த்தது
వేసవి విజ్ఞాన శిబిరంలో మానవాళి మనుగడకు భగవద్గీత  అవగాహన
గోస్పాడు శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో ఈరోజు అనగా తేదీ: 06- 06-2023 న వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నారా చంద్రశేఖర్ రెడ్డి. విద్యార్థిని, విద్యార్థులకు భగవద్గీత మానవాళికి ఎంత అవసరమో ఆధ్యాత్మిక కథల ద్వారా బోధించడం జరిగినది. ప్రతి దినము మనం పుస్తకం చదవటమే కాక, అందులోని నీతిని గురించి తెలుసుకొని మసలుకోవాలని క్లుప్త సరిగా వివరించారు. తదుపరి ఆటలను విద్యార్థులతో ఆడించారు. వీరికి చల్లని నీరు, బిస్కెట్ ప్యాకెట్లను గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని అందజేశారు. ప్రతి దినం పుస్తకం చదవటం మర్చిపోవద్దని హిత బోధ చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி