ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సర్వసాధారణమని, శేష జీవితం ఆనందంగా గడపాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. బుధవారం ఆత్మకూరు ఆర్డీవో మిర్యాల దాసు పదవి విరమణ సన్మాన సభలో పాల్గొని, దాసుకు పూల బొక్కే అందించి, శాలువతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు తనకు సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామాంజి నాయక్ తదితరులు పాల్గొన్నారు.