నంద్యాలలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలో పలుచోట్ల ఆక్రమణలకు గురైన మున్సిపల్ స్థలాలను అధికారులు కాపాడాలంటూ సమావేశంలో అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడారు. మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించిన వారు ఎంతటి వారైనా అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఐ రంగనాయకులు బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.