మిడుతూరు మండలంలోని అలగనూరు రిజర్వాయర్ ను ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, రంగ నాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు ప్రజలకు దాహం తీర్చడానికి మంచినీరు సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం రిజర్వాయర్ మరమ్మత్తులు చేయిoచి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.