విద్యార్థులకు రావాల్సిన విద్యా, వసతి దీవెనల కింద రూ.3.48 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఎ బొగ్గుల విల్సన్ డివిజన్ కార్యదర్శి శ్రీను డిమాండ్ చేశారు. శనివారం పెద్దకడబూరులో ఆయన మాట్లాడారు. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఈ నెల 5న భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.