మంత్రాలయం నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి, సాగునీటి పనులకు నిధులు మంజూరు చేసి, సాగునీటి ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ రాఘవేంద్ర రెడ్డి కోరారు. శనివారం అమరావతిలో జలవనరుల శాఖ, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడం, కరువు ఎక్కువగా ఉండడంతో రైతు కుటుంబాలు వలసలు వెళ్తున్నారని తెలిపారు.