ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కార్తీకమాసం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం భక్తులు అధిక సంఖ్యలో మంత్రాలయానికి చేరుకున్నారు. పవిత్ర తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావన దర్శనం చేసుకున్నారు. స్వామి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది.