ఆదోని: టీడీపీ సభ్యత్వంతో రూ. 5 లక్షల ప్రమాద బీమా
టీడీపీ సభ్యత్వంతో రూ. 5 లక్షల బీమాతో పాటు పలు రాయితీలు లభిస్తాయని ఆదోని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నారు. బుధవారం మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు నాగనాతనహల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. టీడీపీ సభ్యత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య విద్య వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.