కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పులింద్ర శ్రీకాంత్ తెలిపారు. ఏఐఎస్ఎఫ్ 30వ జిల్లా మహాసభలు ఆదోనిలో నవంబర్ 12, 13వ తేదీలో జరుగుతున్న తరుణంలో మంగళవారం మద్దికేర ఏపీ మోడల్ కాలేజీలో మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలన్నారు.