ఆదోని నియోజకవర్గం టీడీపీ మాజీ ఇన్ చార్జ్ గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో పట్టణంలోని సోమవారం భార్ పేటకు చెందిన 35 ముస్లిం కుటుంబాలు టీడీపీలో చేరాయి. సీఎం చంద్రబాబు పాలనపై నమ్మకంతో పార్టీలో చేరామని సయ్యద్ సాబీర్ వలి, ఖాజా ఉసేన్, కటికే ఇమ్రాన్, రోషన్ తెలిపారు. గుడిసె కృష్ణమ్మ మాట్లాడారు. చంద్రబాబు విధానాలు ముస్లిం మైనారిటీలకు మేలు చేస్తాయన్నారు. పార్టీలో చేరిన వారికి గుర్తింపు అందిస్తామన్నారు.