ఖరీఫ్ సీజన్లో విత్తనం వేసుకున్న ప్రతి రైతు ఈ-క్రాప్ పంట నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి జయలక్ష్మి తెలిపారు. చిప్పగిరి రైతు సేవా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మండలంలో రైతులు పాసుపుస్తకం, వన్ బి అడంగల్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను రైతు సేవా కేంద్రంలోకి అందజేసి పంట నమోదు చేయించుకోవాలన్నారు. నమోదు చేసుకోవడానికి ఈనెల 30 వరకు గడువు ఉందన్నారు.