పౌష్టికాహారంతోనే గర్భిణీలు, బాలింతలకు పోషకాలు లభిస్తాయని ఆదోని సీడీపీఓ నాగమణి స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం - 2 నందు గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార వారోత్సవాలలో భాగంగా పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించారు. గర్భిణీలు తప్పనిసరిగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని తద్వారా రక్త వృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇందులో సూపర్ వైజర్లు విజయకమారి, వీర గోవిందమ్మ ఉన్నారు.