డ్వాక్రా, మెప్మా సంఘాల సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల ఆర్థిక పరిస్థితి బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుందని బలంగా నమ్ముతారన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు కావాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.