విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ కంట్రోలర్ పై బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. బుధవారం రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్ కొప్పుల గాంధీపై ఈ బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగడంతో అతడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరారు అవుతున్న బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.