పెడన: పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి
మరమ్మత్తు పనులను నాణ్యత ప్రమాణాలతో పాటించాలని పెడన పురపాలక సంఘ చైర్ పర్సన్ కటకం నాగ కుమారి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పెడనలోని తులసి థియేటర్ దగ్గర కల్వర్టు మరియు రోడ్డు రిపేరు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడంతోపాటు గ్రామాల్లో చెత్తాచెదారం నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.