చందర్లపాడు మండలం చింతలపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ కేంద్రాన్ని బుధవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ కషాయాలు తయారుచేసుకోలేని రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉండేవిధంగా ప్రకృతివ్యవసాయం వనరుల విక్రయకేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని రైతులు అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలను ఆహారంగా తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్ఎఫ్ఏ రామగోవిందు రైతులను కోరారు.