కృష్ణా జిల్లాలోని హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని పోలీస్ కార్యాలయంలో సుదీర్ఘకాలం పాటు హోంగార్డుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన హెచ్. జి -124 కె. రాజా రావు హోమ్ గార్డ్స్ వన్డే కాంట్రిబ్యూషన్ రూ. 4, 11, 370లు చెక్కును ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ సిబ్బందికి అండగా ఉంటుందన్నారు.