గుడివాడ: ఘనంగా జరిగిన నాగుల చవితి వేడుకలు
గుడివాడ పట్టణం తాసిల్దార్ కార్యాలయం వద్ద గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం నాగుల చవితి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము మూడు గంటల నుండే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. పుట్టలో పాలు పోసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దీప పూజలు నిర్వహిస్తూ.. భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు.